Sticky post

కేసిఆర్ నియోజకవర్గ భీఆర్ఎస్ కీలక నేత కాంగ్రెస్ కు జంప్?

-గజ్వేల్ నియోజకవర్గం నుండి పలువురు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి? -ఇప్పటికే ఓ కీలక నేత తమ అనుచరులను కాంగ్రెస్ కి సాగనంపి పార్టీలో చక్రం తిప్పుతున్న వైనం -జిల్లా వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆ నేత రాకపై నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలు కొందరు అసంతృప్తి -కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉండడం వల్లేనేమో భీఆర్ఎస్ పెద్దల ఫోన్ సైతం లిఫ్ట్ చేయకున్నారు -భీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అడగకుండానే కొన్ని బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఏ మీటింగ్ లోను కానరానిది అందుకేనా? హెచ్ ఎస్9 న్యూస్ ప్రతినిధి, మెదక్ … కేసిఆర్ నియోజకవర్గ భీఆర్ఎస్ కీలక నేత కాంగ్రెస్ కు జంప్?ని చదవడం కొనసాగించండి

సమస్య ఏదైనా ఎక్కడైనా వ్యవధి కాలంలో పరిష్కారం చేస్తున్న HS9 న్యూస్..

వృద్ద దంపతులకు ఆశ్రయం కల్పించిన HS9 న్యూస్ టీం హెస్9 సిబ్బంది బొగ్గుట నిరంజన్ పోతుల మల్లేష్ ని అభినందించిన అధికారులు స్థానికులు… హెస్9 న్యూస్ ప్రతినిధి సిద్దిపేట: ఓ తండ్రి మగ్గం నేస్తూ ఓ పూట తిని తినక పస్తులు ఉంటూ బిడ్డలను సాకీ, పిల్లలు ప్రయోజకులైన తర్వాత నలుగురు కొడుకులు, నలుగురు కోడలు, మనవళ్ళు మనవరాల్లు, పదులకొద్దీ సంతానం ఉన్నప్పటికీ , బుక్కెడు బువ్వకు నోచుకోక, నువ్వేం సంపాదించావు అంటే అవమానాలు భరించలేక , తల్లి ముందే తండ్రిని చెప్పుతో కొడతానన్న కోడలితో పడలేక వృద్ధ దంపతులు ఈ … సమస్య ఏదైనా ఎక్కడైనా వ్యవధి కాలంలో పరిష్కారం చేస్తున్న HS9 న్యూస్..ని చదవడం కొనసాగించండి

సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న సిద్దిపేటకు చెందిన యువకుడు గ్యాదరి గిరి….

కె.వి.ఆర్ ట్రస్ట్ చైర్మన్ కల్వకుంట్ల వంశీ ధర రావు సేవలే నాకు స్ఫూర్తి… HS9 న్యూస్ సిద్దిపేట సిద్దిపేటలో “KCR “నగర్ డబుల్ బెడ్ రూమ్ 62 బ్లాక్ లో నిరుపేద కుటుంబానికి చెందిన  బాగూరి యాదగిరి  మరణించడంతో విషయం తెలుసుకున్న కె.వి.ఆర్ ట్రస్ట్ సభ్యుడు గ్యాదరి గిరి సేవా దృక్పథంతో తన సొంత డబ్బులు వెచ్చించి మరణించిన వారి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేసి వారి కుటుంబంలో మనోధైర్యాన్ని నింపారు . ఈ సందర్భంగా యువకుడు గిరి మాట్లాడుతూ కల్వకుంట్ల వంశీధర్ రావు గారి స్ఫూర్తిని తీసుకొని ఈ … సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న సిద్దిపేటకు చెందిన యువకుడు గ్యాదరి గిరి….ని చదవడం కొనసాగించండి

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీ

హెచ్ ఎస్9 న్యూస్ బ్యూరో ,తెలంగాణ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కెసిఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నియామలకు పూర్తిగా ఇది విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఈసీ సంఘం కెసిఆర్ నుండి వివరణ … కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన ఈసీని చదవడం కొనసాగించండి

పోలీస్ లకు పుష్ప 3 సినిమా ట్రైలర్ చూపించిన జాదుగాడు

హెచ్ ఎస్9 న్యూస్, ఖమ్మం జిల్లా,మే 01 :పోలీసుల కళ్లుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్తకొత్త మార్గాల్ని ఎంచు కుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివి తేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు.అది కూడా పుష్ప మూవీ తరహాలో. కానీ, పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు.ఖమ్మంలో తనిఖీలు నిర్వ హిస్తున్న పోలీసులకు …15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు. ముందు పోలీసులకు అనుమానమే రాలేదు. కానీ, కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు. అంతే, కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.ముందు, ప్యాంట్‌ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని … పోలీస్ లకు పుష్ప 3 సినిమా ట్రైలర్ చూపించిన జాదుగాడుని చదవడం కొనసాగించండి

కడియం శ్రీహరికి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు

హెచ్ ఎస్9 న్యూస్ : హైకోర్టు చెప్పడంతో స్పీకర్ కార్యాలయానికి అనర్హత పిటిషన్ అందచేసిన ప్రభుత్వం తరుపు న్యాయవాది.స్టేషన్‌ఘన్‌పూర్‌, భద్రాచలం అసెంబ్లీ స్థానాల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసి, దీనికి కౌంటర్‌ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.. తదుపరి విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. కడియం శ్రీహరికి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులుని చదవడం కొనసాగించండి

కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి

హెచ్ ఎస్9 న్యూస్  : కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురు మరణించగా.. తల్లి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతిని చదవడం కొనసాగించండి

జిల్లాలో ప్లెక్సీలు కలకలం …పార్టీలు మారితే చెప్పు దెబ్బలు

జిల్లాలో నాయకులు అధికార పార్టీలో మారుతున్న నాయకులకు ఫ్లెక్సీల ద్వారా హెచ్చరికలు… ఫ్లెక్సీలో ఫోటోలకు చెప్పుల దండలు పార్టీలు మారుతున్న నాయకులకు చమర గీతం మొదలైంది .అంటూ వెలసిన ఫ్లెక్సీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకులారా ఖబర్దార్… HS9 న్యూస్ ప్రతినిధి సిద్దిపేట: పార్టీలు మారిన నాయకులను హెచ్చరిస్తూ సిద్దిపేట జిల్లాలో ఫ్లెక్సీలు వెలసి స జిల్లాలో కలకలం సృష్టించాయి.. అధికార పార్టీలో మారిన నాయకులు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా చెప్పుల దండ కూడా వేసి ఫ్లెక్సీలో ప్రదర్శించారు.గుర్తు తెలియని వ్యక్తులు సిద్దిపేట జిల్లాలో … జిల్లాలో ప్లెక్సీలు కలకలం …పార్టీలు మారితే చెప్పు దెబ్బలుని చదవడం కొనసాగించండి

ప్రభుత్వ భూమి కబ్జాని వ్యతిరేకిస్తూ లోకాయుక్తలో ఫిర్యాదు

-ఓ సంఘం పేరుతో హిందూ స్మశాన వాటిక భూమి కబ్జా -తాహసిల్దార్ కి ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడంతో కలెక్టర్ కి ఫిర్యాదు -అడిషనల్ కలెక్టర్ స్వయంగా తహసీల్దార్ కి ఫోన్ చేసి చెప్పినప్పటికీ నామమాత్రపు సందర్శన చేసిన తహసిల్దార్ -నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న  మున్సిపల్, రెవెన్యూ అధికారులపై  మరియు కబ్జాకోరులపై లోకాయుక్తలో ఫిర్యాదు -ఎన్ని బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు దేనికైనా సిద్ధం అంటున్న పౌరుడు హెచ్ ఎస్9 న్యూస్ ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు ప్రభుత్వ ఆస్తులు కనుమరుగు అవుతున్నాయి. కబ్జా కోరులు రోజుకో … ప్రభుత్వ భూమి కబ్జాని వ్యతిరేకిస్తూ లోకాయుక్తలో ఫిర్యాదుని చదవడం కొనసాగించండి

ఫాసిస్టు బిజెపి పార్టీని ఓడించండి – సిపిఐ(ఎం.ఎల్)

హెచ్ ఎస్9 న్యూస్ ప్రతినిధి, సిద్దిపేట : ఫాసిస్టు బిజెపి పార్టీని ఓడించి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి చింత భూమేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు.శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆద్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన వారు మాట్లాడుతూ భాజపా దేశంలో ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు గీసి ఫాసిస్టు పాలనను పదేండ్ల కాలంగా కొనసాగించిందని మండిపడ్డారు.దేశంలో అనేక అల్లర్లకు ,మత గొడవలకు కారణం అయ్యిందని, … ఫాసిస్టు బిజెపి పార్టీని ఓడించండి – సిపిఐ(ఎం.ఎల్)ని చదవడం కొనసాగించండి

ఒకరికి బదులు ఒకరు ఎగ్జామ్

హెచ్ ఎస్9 న్యూస్ ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో,ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తూ పంపరి కిషన్ అనే వ్యక్తి విద్యాధికారులకు పట్టుబడ్డ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్సాన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ కు బదులుగా కిషన్ పరీక్షలు రాస్తున్నట్టు,గా గుర్తించిన విద్యాశాఖ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం . ఒకరికి బదులు ఒకరు ఎగ్జామ్ని చదవడం కొనసాగించండి